యూ ట్యూబ్ లోను 'ఇస్మార్ట్ శంకర్' జోరు

29-04-2020 Wed 17:03
advertisement

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. రామ్ మాస్ లుక్ .. తెలంగాణ యాసలో డైలాగ్ డెలివరీ .. నిధి అగర్వాల్ - నభా నటేశ్ గ్లామర్ .. మణిశర్మ సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి.

సక్సెస్ పరంగా చాలాకాలం తరువాత పూర్తిస్థాయిలో పూరి దాహాన్ని తీర్చిన సినిమా ఇది. అలాగే చాలా గ్యాప్ తరువాత రామ్ కి సరైన హిట్ ఇచ్చిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా హిందీ అనువాదాన్ని యూ ట్యూబ్ లో వదలగా, ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. యూ ట్యూబ్ లో ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. తెలుగులో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సినిమాను, హిందీలో రీమేక్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement