వాట్సాప్ స్టేటస్‌గా కరోనా బాధిత విద్యార్థిని ఫొటో.. యువకుడి అరెస్ట్
27-04-2020 Mon 07:32
- కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఘటన
- అరెస్ట్ చేసిన పోలీసులు
- వివరాలు బహిర్గతం చేస్తే శిక్ష తప్పదన్న పోలీసులు

కరోనా బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుని, ఆమె వివరాలను బహిర్గతం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిందీ ఘటన. నిందితుడు అనిల్ రాథోడ్ (24) శనివారం బాధిత విద్యార్థిని ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి.. ‘బ్యాడ్ న్యూస్, ఈ విద్యార్థిని కరోనా సోకింది’ అని రాసుకొచ్చాడు.
విషయం పోలీసుల దృష్టికి చేరడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థినిని ఉద్దేశపూర్వకంగా కించపరిచే ప్రయత్నం చేయడంతోపాటు స్థానికంగా భయాందోళనలు సృష్టించేందుకు యత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి బారినపడి వారి వివరాలను బహిర్గతం చేయడం నేరమని, అలా చేస్తే శిక్ష తప్పదని విజయపుర పోలీసులు హెచ్చరించారు.
More Telugu News
తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్
4 hours ago
