ఫ్యాన్లు, టాయిలెట్లు పని చేయవు.. ప్లాస్టిక్‌ కవర్లో భోజనం: గోడు వెళ్లబోసుకున్న యూపీ వైద్యులు!

23-04-2020 Thu 14:10
Fans Toilets Dont Work UP Doctors Release Videos from their quarantine centre

తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వైరస్‌  బాధితులకు చికిత్స అందిస్తున్న  వైద్యులు, వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా వారిపై దాడులు జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. కానీ, నిరంతరం శ్రమిస్తున్న వైద్యులకు ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్న విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బలేరి జిల్లాలో కొవిడ్19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఓ ప్రభుత్వ పాఠశాలలో ‘యాక్టివ్ క్వారంటైన్’ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పాఠశాల చాలా అధ్వానంగా ఉంది. ఫ్యాన్లు తిరగడం లేదు, టాయిలెట్లు పని చేయడం లేదు.. విశ్రాంతి తీసుకునే గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. దాంతో ఆ దుస్థితిని వీడియో తీసిన వైద్య సిబ్బంది నెట్‌లో పెట్టారు. జిల్లా ప్రధాన ఆరోగ్య అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన యూపీ ప్రభుత్వం.. సదరు వైద్య సిబ్బందిని ఈ పాఠశాల నుంచి ఓ అతిథి గృహానికి పంపించింది.

కరోనా రోగులకు చికిత్స చేయడం వల్ల ఇంటికి వెళ్లకుండా క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న తమకు ప్రభుత్వ అధికారులు కేటాయించిన కేంద్రంపై  వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ క్వార్టర్స్‌ ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతూ బుధవారం రాత్రి మూడు గంటల సమయంలో రెండు వీడియోలను విడుదల చేశారు.

‘ఇప్పుడు రాత్రి మూడు అవుతోంది. కరెంట్ లేదు. ఒకే గదిలో నాలుగు మంచాలు వేశారు. పేరుకు ఇది ఫైవ్ స్టార్ క్లాస్ కానీ, ఇక్కడ ఫ్యాన్ కూడా తిరగడం లేదు. కామన్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. టాయిలెట్స్‌ వద్ద నల్లాలు కూడా లేవు. అవి పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. యాక్టివ్‌ క్వారంటైన్‌లో మేం ఇలా ఉండాల్సి వస్తోంది’ అని వాటిని చూపిస్తూ  ఓ వైద్యుడు వీడియోలో వివరించాడు.  

తమకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో మరో వీడియో ద్వారా తెలిపారు. ‘మధ్యాహ్న భోజనంగా మాకు ఇచ్చిన ఆహారం చూడండి. ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని తీసుకొచ్చారు. పూరీలు, కూరలు మొత్తం ఒకేదాన్లో వేశారు. కరోనా రోగులకు చికిత్స చేసే పనిలో ఉన్న వైద్యులకు, సిబ్బందికి ఇలాంటి ఆహారం ఇస్తున్నారు. మేం పడుకునేందుకు  ఓ పెద్ద క్లాస్‌ రూమ్‌లో నాలుగు బెడ్స్ వేశారు. రాత్రంతా కరెంట్ లేదు. 20 లీటర్ల వాటర్ బాటిల్ ఇచ్చి.. దాన్నే అందరూ తాగాలని చెప్పారు’ అని పేర్కొన్నారు.

ఇక వైద్య సిబ్బంది నుంచి ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే ... ఈ పాఠశాలను పరిశీలించినట్టు జిల్లా ప్రధాన వైద్య అధికారి తెలిపారు. అధికారులతో కలిసి వారిని దగ్గర్లోని అతిథి గృహానికి పంపించామన్నారు.

..Read this also
మా ప్రాణాలకు ముప్పు ఉంది: సుప్రీంకోర్టులో శివసేన రెబెల్స్ పిటిషన్
 • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రెబెల్స్ నాయకుడు ఏక్ నాథ్ షిండే
 • బతికున్న శవాలు అంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్ లో పేర్కొన్న వైనం
 • సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని కోర్టుకు వెల్లడి


..Read this also
య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు... టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజ‌రు
 • విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా
 • పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో నామినేష‌న్ దాఖ‌లు
 • రాహుల్ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్‌, అఖిలేశ్ త‌దిత‌రుల హాజ‌రు

..Read this also
ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
 • ఇద్దరు మహిళల మధ్య లెస్బియన్ సంబంధం
 • కలసి జీవించేందుకు పెద్దల నిరాకరణ
 • ఇద్దరిలో ఒకరు పురుషుడిగా మారాలని నిర్ణయం
 • ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రిలో సర్జరీ
 • ఏడాదిన్నర తర్వాతే పూర్తిస్థాయి పురుషుడిగా మార్పు


More Latest News
CM Jagan releases Amma Odi funds
Shiv Sena rebel Eknath Shinde files petition in Supreme Court
Yashwant Sinha files his nomination for the election of president on india
UP woman switches gender to be with girlfriend after families oppose relation
Uddhav Thackeray Strips Rebel Ministers Of Portfolios
Interesting title for charan shankar new movie
ED summons Shiv Sena MP Sanjay Raut
Increased usage of antacids among GERD patients silent cause of CVDs
Cyber criminals request money from police using DGPs photo as whatsapp DP
Video of Actor Srikanth daughter Medha
Allari Naresh 60th movie with naandi director vijay Announced today
Woman 6 Year Old Daughter Gangraped In Moving Car Uttarakhand Police
Bihar Maoist arrested with Chinese assault rifle
Ram in Harish Shankar Movie
BCCI very Un happy with Rohit Sharma an official says Very irresponsible they ignored all advice
..more