'వాలిమై' కోసం డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్న యాక్షన్ సీన్స్

20-04-2020 Mon 13:04
advertisement

తమిళ స్టార్ హీరోలలో అందగాడుగా అజిత్ కి మంచి క్రేజ్ వుంది. కొంతకాలంగా ఆయన వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ - ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. లాక్ డౌన్ తరువాత ఈ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో అజిత్ .. తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన హుమా ఖురేషి .. యామీ గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement