కరోనా కట్టడి కోసం 'ఇంటెలిజెంట్ లాక్ డౌన్' అమలు చేస్తున్న నెదర్లాండ్స్

14-04-2020 Tue 21:10
Nederlands implements Intelligent Lock Down to fight against corona

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి గురైన దేశాల్లో నెదర్లాండ్స్ కూడా ఒకటి. ఈ యూరప్ దేశంలో ఇప్పటివరకు 27,419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,945 మంది మరణించారు. అయితే ఇతర యూరప్ దేశాలైన ఇటలీ, స్పెయిన్ కంటే ఇక్కడ తక్కువ జననష్టం జరిగిందనే చెప్పుకోవాలి. నెదర్లాండ్స్ లో కరోనా ఉనికి ప్రారంభమైన క్షణం నుంచి ఇంటెలిజెంట్ లాక్ డౌన్ విధానం అమలు చేస్తున్నారు. ఇది సంపూర్ణ లాక్ డౌన్ కాదు. ఎక్కడ ప్రజలు నేరుగా ఒకరిని ఒకరు తాకే అవకాశం ఉందో అక్కడ మాత్రం లాక్ డౌన్ విధించారు.

సెలూన్లు, రెడ్ లైట్ ఏరియాలను మూసేశారు. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించారు. పూల దుకాణాలు, బేకరీలు, టాయ్ షాపులు, ఇనుము దుకాణాలు వంటివి తెరిచే ఉంచారు. ఈ దుకాణాల వద్ద భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. తెరిచి ఉంచిన దుకాణాల వద్దకు వచ్చే ప్రజలు అక్కడి పోస్టర్లు, నేలమీద వేసిన గుర్తులు చూసి కరోనా పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. దుకాణదారులు కూడా గ్లోవ్స్, మాస్కులు ధరించి వ్యాపారాలు చేసుకుంటుండడంతో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది.

ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఒకరి నుంచి ఒకరు ఐదు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, నెదర్లాండ్స్ జనాభా 1.72 కోట్లు మాత్రమే కావడంతో ఆ లెక్కన చూస్తే కరోనా మరణాల రేటు అధికంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

..Read this also
'శాండ్​ విచ్'​పై గొడవ.. రెస్టారెంట్ సిబ్బందిపై కాల్పులు జరిపిన కస్టమర్​.. ఒకరి మృతి!​
  • సబ్ వే రెస్టారెంట్ లో వెన్న తరహాలో ఉండే మేయో విషయంపై వివాదం
  • ఆగ్రహంతో ఉన్మాదిలా మారిన కస్టమర్
  • ఇద్దరు మహిళా సిబ్బందికి గాయాలు.. వారిలో ఒకరు మృతి
  • కుమారుడి కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో తీవ్ర విషాదం


..Read this also
110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారి మార్పు చెందుతోంది: డబ్ల్యూహెచ్​ వో హెచ్చరిక
  • కరోనా వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదు
  • పరీక్షలు, కొత్త కేసుల నమోదు తగ్గిపోవడంతో సమస్య
  • కొత్త వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారిందని వెల్లడి

..Read this also
కాంగోలో మిలిటెంట్ల అరాచకం.. నిర్బంధంలోని వారికి మానవ మాంసం వడ్డింపు!
  • ఓ మహిళను అపహరించిన రెండు మిలిటెంట్ గ్రూపులు
  • ఆమెపై పదే పదే అత్యాచారం
  • మానవ మాంసాన్ని వండించిన తీవ్రవాదులు
  • తమ నిర్బంధంలో ఉన్న వారికి తినిపించిన వైనం


More Latest News
Activists have no value in TRS Confidence in Congress is gone Joining BJP says Konda Vishweshwar Reddy
Sajjala opines on laptops issue
amaravati mp navneet kaur rana meets draupadi murmu in delhi
Dasara movie upadate
Telangana tentd class exams results released
Mantri Sridevi appointed as Telangana official language committee chairperson
maharashtra new cm eknath shinde gone to depression for so many months
Traffic in Bengaluru Humidity in Chennai Cost in Mumbai Hyderabad is better says KTR
Vishnu Vardhan Reddy fires on TRS
Itulu Maredumilli Niyojaka Vargam teaser released
England team announced
subway employee shot dead by customer after argument over too much mayo
maharashtra new sm is eknath shinde
Fadnavis and Shinde met governor
anthrax outbreak in kerala forest
..more