'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ వచ్చే ఏప్రిల్ కి వెళ్లే అవకాశం?

13-04-2020 Mon 12:40
advertisement

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ .. హాలీవుడ్ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మిగతా షూటింగు వాయిదా పడింది. ఈ ప్రభావం విడుదల తేదీపై పడిందనే టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోకుండా 2 నెలల గ్యాప్ వచ్చేసింది. అందువలన వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని భావిస్తున్నారట. ఎందుకంటే ఈ సినిమా విడుదల తేదీని బట్టి, మిగతా సినిమాల విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement