మా వంతు సాయం చేస్తున్నాం.. మీరూ చేయండి: దీపిక, రణ్​వీర్

04-04-2020 Sat 13:22
advertisement

కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి  సెలబ్రిటీల నుంచి మంచి  స్పందన వస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలిచేందుకు ఏర్పాటైన ‘పీఎం కేర్స్ ఫండ్’కు బాలీవుడ్ నటులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ జంట రణ్ వీర్- దీపిక పదుకునే కూడా చేరింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తున్నట్టు దీపిక ఈ రోజు ఉదయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

 ‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు మా వంతు సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా  ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్’ అని దీపిక ట్వీట్ చేసింది. అయితే తాము ఎంత విరాళం ఇస్తున్నామనే విషయాన్ని ఈ జంట వెల్లడించలేదు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement