సిక్స్ ప్యాక్ కోసం నిఖిల్ కసరత్తు

04-04-2020 Sat 13:20
advertisement

నిఖిల్ కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'అర్జున్ సురవరం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. గతంలో విజయాన్ని సాధించిన 'కార్తికేయ'కి ఇది సీక్వెల్. 'కార్తికేయ 2' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో 4 వారాలలో పూర్తి షేప్ ను సాధిస్తానని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చందూ మొండేటికి ఈ సీక్వెల్ ఊరటనిస్తుందేమో చూడాలి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement