సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
  *  అందాలతార సమంత త్వరలో ఓ బయోపిక్ లో కథానాయికగా నటించనుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు 'బెంగళూరు నాగరత్నమ్మ' జీవితాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగరత్నమ్మ పాత్రకు సమంతను ఎంచుకున్నట్టు, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం.
*  ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'బ్రోచేవారెవరురా' ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ కి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  ఆమధ్య వచ్చిన 'కేజీఎఫ్' చిత్రం సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నెగటివ్ రోల్ ను పోషిస్తోందట.  
Thu, Apr 02, 2020, 07:37 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View