సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

18-03-2020 Wed 07:24
advertisement

 *  చిరంజీవి, కొరటాల కాంబోలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో మహేశ్ బాబు నటిస్తాడంటూ వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చడం లేదని తెలుస్తోంది. ఆ పాత్రను చరణ్ పోషించనున్నట్టు సమాచారం. ఇక ఇందులో చరణ్ సరసన నాయిక పాత్రకు కైరా అద్వానీని ప్రయత్నిస్తున్నారట.
*  ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  మహేశ్ బాబు తన జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెబ్ సీరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అమెజాన్ కోసం చేయనున్న ఓ వెబ్ సీరీస్ కి దర్శకుడిగా దేవ కట్టాను ఎంచుకున్నట్టు సమాచారం.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement