చనిపోవాలనుకుంటున్నాం.. అనుమతించండి: రాష్ట్రపతికి నిర్భయ దోషుల కుటుంబీకుల లేఖ
16-03-2020 Mon 12:15
- పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారు
- క్షమించడంలో కూడా అధికారం ఉంది
- ప్రతీకారం అధికారానికి నిర్వచనం కాదు

తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్భయ దోషుల కుటుంబసభ్యులు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో వారి తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారని లేఖలో వారు పేర్కొన్నారు. ప్రతీకారం అనేది అధికారానికి నిర్వచనం కాదని... క్షమించడంలో కూడా అధికారం ఉందని చెప్పారు.
మరోవైపు ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్షలను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు.
More Latest News
ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
43 seconds ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
14 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
30 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
34 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
46 minutes ago

మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
2 hours ago
