హిందువులకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన పాక్ ప్రధాని... మండిపడిన అతివాదులు
10-03-2020 Tue 17:15
- వర్ణభరిత హోలీ శుభాకాంక్షలు అంటూ ఇమ్రాన్ ట్వీట్
- ఓ ప్రధాని హిందువులకు శుభాకాంక్షలు చెప్పడమేంటన్న అతివాదులు
- ఇమ్రాన్ నిర్ణయాన్ని స్వాగతించిన మరో వర్గం

హోలీ పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ లో హిందువులకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు చెప్పారు. హిందూ సమాజానికి వర్ణభరిత హోలీ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అయితే దీనిపై పాకిస్థాన్ లో అతివాదులు మండిపడ్డారు. ఒక ప్రధాని హిందువులకు శుభాకాంక్షలు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానికి ఇది తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికొందరు మాత్రం ఇమ్రాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశంలో ముస్లింలు, హిందువులు సమానమేనని, అన్ని వర్గాల సమభావాన్ని ప్రధాని తన వ్యాఖ్యలతో చాటిచెప్పారని కొనియాడారు. పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులు భారత్ లోని హిందువులు జరుపుకునే అన్ని పండుగలు జరుపుకుంటారు.
More Telugu News
ఈ వేడుకకు ఇంతమంది వస్తారని ఊహించలేదు: మహేశ్ బాబు
44 minutes ago

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్
2 hours ago
