శంషాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు
10-03-2020 Tue 09:26
- ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది ప్రయాణించే ఎయిర్‌పోర్టు విభాగంలో ఎంపిక
- భద్రతతో కూడిన మెరుగైన సేవలకు గుర్తింపు
- సెప్టెంబరులో పోలెండ్‌లో అవార్డు అందజేత

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ‘ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) పురస్కారాన్ని ప్రకటించింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల విభాగంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఎంపికైంది. భద్రతతో కూడిన మెరుగైన సేవలు అందించడం, పర్యావరణం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వంటి వాటికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది సెప్టెంబరులో పోలెండ్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పురస్కారాన్ని అందించనుంది. విమానాశ్రయానికి ఏఎస్‌క్యూ పురస్కారం రావడంపై విమానాశ్రయ సీఈవో ఎస్జీకే కిషోర్ ఆనందం వ్యక్తం చేశారు.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
20 minutes ago

ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
49 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
