11 ఏళ్ల బాలికతో సంబంధం పెట్టుకున్న అమెరికాలోని భారత విద్యార్థికి 10 ఏళ్ల జైలు శిక్ష
06-03-2020 Fri 09:45
- స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లిన సచిన్ భాస్కర్
- లైంగికంగా ప్రలోభపెడుతూ మైనర్ బాలికకు మెయిల్
- జూన్ 17 నుంచి అమల్లోకి రానున్న శిక్ష

స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థికి అక్కడి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 11 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక వాంఛ తీర్చుకున్నట్టు రుజువు కావడంతో అతనికి శిక్షను ఖరారు చేసింది. మైనర్ బాలికకు 23 ఏళ్ల సచిన్ భాస్కర్ అనే విద్యార్థి లైంగికంగా ప్రలోభపెట్టే విధంగా ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపాడని ప్రాసిక్యూటర్లు కోర్టులో వాదించారు. 2018 ఆగస్టు 11న సదరు బాలికతో శారీరకంగా కలిశాడని కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సచిన్ భాస్కర్ కు శిక్షను విధించింది. జూన్ 17 నుంచి ఈ శిక్ష అమల్లోకి రానుంది.
More Latest News
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
7 hours ago

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
7 hours ago

నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్
8 hours ago
