'మగధీర'లో చేయకపోవడమే నేను చేసిన పొరపాటు: నటి అర్చన

04-03-2020 Wed 11:46
Sri Ramadasu Movie

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో అర్చన ఒకరు. 'శ్రీరామదాసు' సినిమాలో ఆమె చేసిన 'సీత' పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆ స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది.

"రాజమౌళిగారు  'మగధీర' సినిమా చేసే సమయంలో, ఒక ముఖ్యమైన పాత్రకిగాను నన్ను సంప్రదించారు. అయితే ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన అంగీకరించలేకపోయాను. ఆ తరువాత ఆ పాత్రని 'సలోని' చేసింది. ఆ పాత్రను చేయలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతూ వుంటాను.

ఆ తరువాత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తన చిత్రంలో కథానాయికగా నాకు అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల వలన ఆ సినిమాను కూడా నేను చేయలేకపోయాను. వేరే హీరోయిన్ చేసిన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుని వుంటే నా కెరియర్ వేరేలా ఉండేది. వాటిని వదులుకోవడం నిజంగా నేను చేసిన పొరపాటే" అని చెప్పుకొచ్చింది.


More Telugu News
Kodali Nani furious on TDP leaders
Police arrests TDP leader Budda Venkanna
Thank you movie update
Budha Venkanna fires on Kodali Nani
Raghurama replies Vijayasai Reddy tweet
Major movie update
Kavitha counters Bandi Sanjay remarks
PM Modi interacts Pradhan Mantri Bala Puraskar awardees
Mahan Movie Updete
Vijayasai Reddy talks to media after meeting with union govt secretaries
Ranga Ranga Vaibhavanga new poster
AP Corona Full Details
NASA explains Tonga volcanic eruption power
Forty two people dead in Afghanistan due to extreme snowfall
Andhra Pradesh employees gives strike notice to govt
..more