కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన రేవంత్ రెడ్డి అరెస్ట్
02-03-2020 Mon 18:44
- కేటీఆర్ అక్రమ నిర్మాణాలు నిర్మించారంటూ రేవంత్ ఆరోపణలు
- గండిపేట వెళ్లే దారిలో ఫామ్ హౌస్ నిర్మించారన్న రేవంత్
- నిబంధనలను అతిక్రమించారంటూ విమర్శలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో జన్ వాడ వద్ద కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, చట్టాలను అతిక్రమిస్తూ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ దర్జాగా గడుపుతున్నారని, నిబంధనలకు నీళ్లొదిలి పాతిక ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని, జీవో 111ని అతిక్రమించారని కేటీఆర్ పై ఆరోపణలు చేశారు.
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
13 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
16 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
30 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
46 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
50 minutes ago
