'నాంది' సెకండ్ షెడ్యూల్ మొదలు
02-03-2020 Mon 16:33
- 'అల్లరి' నరేశ్ హీరోగా 'నాంది'
- కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
- సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల

'అల్లరి' నరేశ్ కథానాయకుడిగా 'నాంది' సినిమా నిర్మితమవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో హరీశ్ ఉత్తమన్ కనిపించనున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని 'అల్లరి' నరేశ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
6 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
6 hours ago
