ఆసియా కప్ ఈసారి దుబాయ్ లో... భారత్, పాక్ జట్లు ఆడతాయన్న గంగూలీ
Advertisement
ఆసియా ఖండం స్థాయిలో అగ్రశ్రేణి జట్ల సంకుల సమరంగా పేరుగాంచిన ఆసియా కప్ వేదిక మారింది. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్థాన్ లో సెప్టెంబరులో జరగాల్సి ఉండగా, భద్రతా కారణాలతో తాము రాలేమని భారత్ స్పష్టం చేసింది. దాంతో ఈ వేదికను పాక్ నుంచి దుబాయ్ కి తరలించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ధారించారు.

ఆసియా కప్ దుబాయ్ లో జరుగుతుందని, భారత్, పాక్ జట్లు ఈ టోర్నీలో ఆడతాయని వెల్లడించారు. మార్చి 3న దుబాయ్ లో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశానికి గంగూలీ కూడా హాజరవుతారు. దుబాయ్ వెళ్లే ముందు గంగూలీ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం నేపథ్యంలో భారత జట్టు భద్రత, రాజకీయ పరమైన కారణాలతో గత కొంతకాలంగా పాకిస్థాన్ లో పర్యటించడంలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో ఆడడమే తప్ప ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదు.
Fri, Feb 28, 2020, 10:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View