చంద్రబాబుకు బంగారు పళ్లెంలో పెట్టి మళ్లీ అధికారాన్ని అప్పగిస్తారు: సబ్బం హరి జోస్యం
Advertisement
ఏపీ సీఎం జగన్ మంచి పనులు చేస్తే పది కాలాలపాటు ప్రజలు గుర్తుంచుకుంటారని, చంద్రబాబును విమర్శిస్తున్నంత వరకూ బంగారం పళ్లెంలో పెట్టి అధికారాన్ని మళ్లీ ఆయనకు అప్పగించడం ఖాయమని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఎంతో అవినీతికి పాల్పడ్డాడని చంద్రబాబుపై పుసక్తం వేసిన జగన్, విజయసాయిరెడ్డిలు ఆ విషయాన్ని ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. జగన్ లో మార్పు అయినా రావాలి లేదా 2022 వరకూ ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు భరించనైనా భరించాలని అన్నారు. 2022లో కచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని, అందుకే, ఆ విధంగా చెప్పానని వివరించారు. రెండు సంవత్సరాల పాటు ఇష్టంలేని ప్రభుత్వాన్ని ప్రజలు భరించాలని, ఓపికతో ఉండాలని, ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Fri, Feb 28, 2020, 10:05 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View