సీఎం జగన్ ను కలిసిన మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష
Advertisement
ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ప్రత్యూష తనకు గ్రాండ్ మాస్టర్ నార్మ్ వచ్చిన ఆనందాన్ని సీఎంతో పంచుకున్నారు. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఉన్న ప్రత్యూష ఇకపై గ్రాండ్ మాస్టర్ హోదా అందుకోవడం పట్ల సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలంటూ ఆమెను దీవించారు. కాగా, ప్రత్యూష వెంట ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు.
Fri, Feb 28, 2020, 09:38 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View