నిన్నటి విశాఖ ఘటనలో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు?: సబ్బం హరి
Advertisement
నిన్న విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఘటనలో ఒక్కరిని కూడా ఇంత వరకూ అరెస్టు చేయలేదని మాజీ ఎంపీ సబ్బం హరి విమర్శించారు. చంద్రబాబు యాత్రకు అనుమతిచ్చాం కనుక ఆయన్ని ముందుకు పంపించాలన్న ‘ఇంగిత జ్ఙానం’ కూడా పోలీసులకు లేదని దుయ్యబట్టారు. విశాఖపట్టణం పోలీసులకు నలభై ఏళ్లుగా మంచి పేరుందని, నిన్నటి ఘటనతో విశాఖలోని పోలీస్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు.

 చంద్రబాబును అడ్డుకున్న వారిని పక్కకు తప్పించి ఆయన్ని ఎందుకు ముందుకు పంపించలేదని డ్యూటీలో ఉన్న అధికారులను ప్రశ్నించాల్సిన బాధ్యత విశాఖ సీపీకి ఉందని, ఆ విధంగా ఆయన ప్రశ్నించకపోతే ఈ గూడుపుఠాణిలో సీపీ పాత్ర ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు. అల్లరి మూకతో గొడవ చేయించి చంద్రబాబును వెనక్కి పంపించామని వైసీపీ నేతలు పండగ చేసుకోవడం కాదని, ఆయన్ని అణగదొక్కాలనుకుంటే అంతకంతగా ఎదుగుతారని అన్నారు.  
Fri, Feb 28, 2020, 09:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View