పరిహారం కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు... పిటిషన్  తిరస్కరణ
Advertisement
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన ఘటన దిశ ఉదంతం. ఈ వ్యవహారంలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తెలిసిందే. అయితే, దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఎన్ కౌంటర్ కు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియాగా చెల్లించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం.... కేసుకు సంబంధించి తాము నియమించిన కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో పిటిషన్ పై విచారణ చేపట్టలేమంటూ స్పష్టం చేసింది. అయితే విచారణ కమిషన్ ను కలిసే వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. కమిషన్ ద్వారా న్యాయం జరగలేదని భావిస్తే అప్పుడు తమ వద్దకు రావొచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే వారికి వివరించారు. సుప్రీంకోర్టు సీజే వివరణతో దిశ నిందితుల తరఫు న్యాయవాది పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.
Fri, Feb 28, 2020, 08:49 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View