కోహ్లీ సేనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్
Advertisement
గత కొన్నిరోజులుగా టీమిండియా గెలుపు రుచి చూడక అలమటిస్తోంది. కివీస్ పర్యటనలో వరుస పరాజయాలతో కుమిలిపోతోంది. సిరీస్ కు, సిరీస్ కు మధ్య విరామం ఉండడం లేదని, అలసిపోతున్నామని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. దేశం కోసం అదేపనిగా ఆడుతున్నామని భావిస్తున్న క్రికెటర్లు తాము అలసిపోయామనుకుంటే ఐపీఎల్ లో ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

"ఒత్తిడి, శారీరక అలసటతో బాధపడుతున్న ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరంగా ఉండాలి. ఇక్కడ మీరు దేశానికి ప్రాతినిధ్యం వహించేది ఏదీ లేదు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కలిగే ఉత్తేజం మరోలా ఉంటుంది. దేశం కోసం ఆడే ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ఓ లీగ్ ఫ్రాంచైజీ కోసం ఎంతో కష్టపడుతున్న ఆటగాళ్లు దేశం కోసం ఆడేటప్పుడు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు.
Fri, Feb 28, 2020, 07:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View