విశాఖలో రాజకీయ పక్షాల నేతల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది: విష్ణుకుమార్ రాజు
Advertisement
నిన్న విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖలో చంద్రబాబును అడ్డగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసుల అనుమతితోనే చంద్రబాబు విశాఖ వచ్చారని, ఆయనపై కోడిగుడ్లు, చెప్పులు విసరడం సరికాదని అన్నారు. చంద్రబాబును ప్రజలెవరూ అడ్డుకోలేదని, రాజకీయ పక్షాల నేతల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఇటువంటి చర్యలతో వైసీపీకి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిజాన్ని తీసుకువచ్చే పద్ధతిని ఎవరూ ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.
Fri, Feb 28, 2020, 07:29 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View