చంద్రబాబును అరెస్ట్ చేయలేదు: హోంమంత్రి సుచరిత వివరణ
Advertisement
విశాఖ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయలేదని ఏపీ హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ప్రజలే చంద్రబాబును అడ్డుకున్నారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, పార్టీ కార్యక్రమాల కోసం విశాఖ పర్యటనకు చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. మఖ్యమంత్రిగా చంద్రబాబు మెచ్చుకున్న పోలీసులే ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఉందని... కానీ, విశాఖలో ఆయన అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదని సుచరిత చెప్పారు. ఈ కారణం వల్లే విశాఖకు వెళ్లవద్దని ఆయనకు సూచించామని తెలిపారు. మూడు రాజధానులపై తన స్టాండ్ ను స్పష్టం చేసిన చంద్రబాబు... విశాఖకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
Fri, Feb 28, 2020, 03:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View