ఢిల్లీ అల్లర్ల నడుమ.. మతాంతర వివాహం..ముస్లింను పెళ్లాడిన హిందూ యువతి!
Advertisement
ఒకవైపు ఈశాన్య ఢిల్లీ హింసతో అట్టుడుకుతున్నా.. ఓ హిందూ యువతి తాను ఇష్టపడిన ముస్లింను పెళ్లాడేందుకు వెనకడుగు వేయలేదు. పెళ్లి రోజు కొంతమంది దుండగులు తమ ఇంటిపైకి సీసాలు విసిరేసినా ఆమె కుటుంబం భయపడలేదు. పెళ్లి కూతురు తండ్రి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈశాన్య ఢిల్లీ చాంద్ బాగ్ జిల్లాలోని ఇరుకైన కాలనీలో నివాసం ఉంటున్న ఓ హిందూ–ముస్లిం జంట తమ పెళ్లి కోసం పెద్ద సాహసమే చేసింది. 23 ఏళ్ల సావిత్రి ప్రసాద్ అనే యువతికి పొరుగింటి ముస్లిం కుటుంబానికి చెందిన గుల్షన్‌తో పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, కొన్ని రోజుల ముందు నుంచే సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. దాంతో, పెళ్లి వాయిదా వేసుకోవాలని బంధువులు ఆ యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు.

అయినా సరే ఆమె తండ్రి  భోదయ్ ప్రసాద్‌ వినలేదు. ముందుగా నిర్ణయించినట్టు మంగళవారమే పెళ్లి చేయాలని నిర్ణయించారు. సావిత్రిని పెళ్లి కూతురును చేశారు. కానీ, ఓ అల్లరి మూక ఆ ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ ఇంటి ముందు సీసాలు విసిరి నానా హంగామా చేయడంతో గడియ వేసుకొని  కుటుంబ సభ్యులంతా బిక్కుమంటూ బతికారు. తన పెళ్లి జరుగుతుందో లేదో అని సావిత్రి కన్నీటి పర్యంతం అయింది.

అయితే, తన కూతురుకు ధైర్యం చెప్పిన భోదయ్ తర్వాతి రోజే పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఆయనకు చుట్టుపక్కల ఉన్న ముస్లిం కటుంబాలు అండగా నిలిచాయి. దాంతో బుధవారం ఆమె పెళ్లి జరిగింది.
Fri, Feb 28, 2020, 03:07 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View