రోజూ 70 నిమిషాలు వీడియోలపైనే.. నెలకు సగటున 11 జీబీ డేటా వాడేస్తున్నాం
28-02-2020 Fri 15:05
- నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ అధ్యయనంలో వెల్లడి
- 2018తో పోలిస్తే 2019లో 47 శాతం డేటా వినియోగం పెరిగింది
- ఓటీటీలు అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు తగ్గడమే కారణం

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడుతున్నవారి డేటా వినియోగం 2018లో పోలిస్తే 2019లో భారీగా పెరిగింది. సగటున ఒక్కొక్కరు నెలకు 11 గిగాబైట్ల (జీబీల) డేటా వాడేస్తున్నారు. నోకియా సంస్థకు చెందిన వార్షిక మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ అధ్యయనంలో తేలింది. దేశంలో వాడుతున్న మొత్తం మొబైల్ ఇంటర్ నెట్ లో 96 శాతం డేటా 4జీ నెట్ వర్క్ లపై నే జరుగుతున్నట్టు లెక్కించారు. ఇక ఒక్కొక్కరు సగటున రోజూ 70 నిమిషాల పాటు ఆన్ లైన్లో వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారని తేల్చారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరగడంతో..
ఆన్ లైన్ లో వీడియో కంటెంట్ ను అందించే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లకు తోడుగా సుమారు 30 వరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి రావడంతో వీడియోలను చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై సగటున ఒక్కొక్కరు 70 నిమిషాల పాటు వీడియోలు చూస్తున్నారు.- 2018లో కంటే 2019లో 4జీ మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. వినియోగంలో ఉన్న 4జీ ఫోన్ల సంఖ్య 50 కోట్లకు చేరింది.
- ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం గత నాలుగేళ్లలోనే ఏకంగా 44 రెట్లు పెరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం.
- 4జీ ఫోన్లలో VoLTE (వాయిస్ ఓవర్ ఎల్ టీఈ) సదుపాయం ఉన్నవాటి సంఖ్య 43.2 కోట్లకు చేరింది.
- ఓటీటీల్లో ప్రాంతీయ భాషల సీరియళ్లు, షార్ట్ ఫిల్మ్ లు, సినిమాలు అందుబాటులోకి రావడం.. సబ్ స్క్రిప్షన్ చార్జీలు కూడా తగ్గడంతో వినియోగం పెరిగింది.
- మొబైల్ ఫోన్ల ధరలు బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయని, అదే సమయంలో డేటా ధరలు కూడా అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని నోకియా అధ్యయనం నివేదిక పేర్కొంది.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
52 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
59 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 hour ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
