పోలీసుల సూచనతో విశాఖ నుంచి హైదరాబాద్ పయనమైన చంద్రబాబు
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన అర్ధంతరంగా ముగిసింది. చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించేందుకు ఇవాళ వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడ ఆయన్ను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. దాంతో ముందస్తుగా చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించారు. పరిస్థితులు ఎంతకీ సద్దుమణగకపోవడంతో చంద్రబాబు విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. అంతేకాదు, ఆయనకు విశాఖ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ కూడా తీశారు. దీనిపై డీసీపీ ఉదయ్ భాస్కర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు నచ్చచెప్పారు. పోలీసుల సూచనతో చంద్రబాబు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. చంద్రబాబు వెళ్లిపోవడంతో ఎయిర్ పోర్టులో ఉన్న టీడీపీ నేతలు వెనుదిరిగారు.​
Thu, Feb 27, 2020, 08:35 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View