అల్లర్లలో ఆప్ నేతల హస్తం ఉంటే వారిపై రెట్టింపు చర్యలుంటాయి: కేజ్రీవాల్
Advertisement
ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో 35 మంది మరణించడం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగుల్చుతోంది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ అల్లర్ల బాధ్యుల్లో ఏ ఒక్కరినీ వదల్దొదని, వారిలో ఆప్ నేతలు ఉంటే వారిపై రెట్టింపు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని, రాజకీయాల్లో ఇటువంటి ధోరణులకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. తీవ్రగాయాలపాలైన వారికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని వెల్లడించారు. ఆసుపత్రి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
Thu, Feb 27, 2020, 06:40 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View