చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన భువనేశ్వరి
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కొన్నిగంటలుగా ఆయన లాంజ్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కొద్దిసేపటి క్రితం వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడి, అనంతరం ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, చంద్రబాబును పోలీసులు విజయవాడ తిప్పి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Thu, Feb 27, 2020, 06:28 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View