విక్రమ్ 'కోబ్రా' నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
Advertisement
విలక్షణమైన పాత్రలకు .. విభిన్నమైన గెటప్పులకు విక్రమ్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. అందువల్లనే జయాపజయాల సంగతిని పక్కకుపెట్టేసి ఆయన సినిమాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన కథానాయకుడిగా  'కోబ్రా సినిమా రూపొందుతోంది.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విక్రమ్ ఫస్టులుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ 25 వేషధారణల్లో కనిపించనుండటం విశేషమని చెబుతున్నారు. దీనిని బట్టే ఈ కథలో ఎన్ని మలుపులుంటాయనేది అర్థమవుతోంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని విక్రమ్ భావిస్తున్నాడు.  
Thu, Feb 27, 2020, 06:10 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View