వరుసగా ఐదో రోజు కూడా నష్టాలే!
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కరోనా వైరస్ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 39,745కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 11,633 వద్ద స్థిరపడింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ నష్టపోయాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.66%), టైటాన్  కంపెనీ (1.87%), ఏసియన్ పెయింట్స్ (1.18%), యాక్సిస్ బ్యాంక్ (1.17%), మారుతి సుజుకి (0.76%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.03%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.25%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.04%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.85%).
Thu, Feb 27, 2020, 03:55 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View