దసరా సీజన్లో రానున్న ప్రభాస్ మూవీ
Advertisement
ప్రభాస్ అభిమానులంతా ఆయన తాజా చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయించడం వలన, షూటింగు విషయంలో కొంత జాప్యం జరిగింది.

పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ హంగులతో రూపొందుతున్న కారణంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారట. రెగ్యులర్ బయ్యర్లకు కూడా ఈ సమాచారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Thu, Feb 27, 2020, 03:53 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View