భారత సంతతి అమ్మాయిని పెళ్లాడబోతున్న ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్
Advertisement
గ్లెన్ మ్యాక్స్ వెల్ గురించి భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ ఐపీఎల్ లో మెరిపించిన మెరుపులను సగటు క్రికెట్ ప్రేమికులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు మ్యాక్స్ వెల్ భారతీయులకు మరింత దగ్గర కానున్నాడు. ఓ రకంగా భారత్ కు అల్లుడు కాబోతున్నాడు. మ్యాక్స్ వెల్ కొంతకాలంగా విని రామన్ అనే భారత సంతతి అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతున్నాడు. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగనుంది. ఇటీవలే తాము నిశ్చితార్థం చేసుకున్నామని మ్యాక్స్ వెల్ చెప్పడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

విని రామన్ కుటుంబం చాన్నాళ్ల కిందట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. విని మెల్బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ అనేక సందర్భాల్లో మీడియా కెమెరాలకు చిక్కారు. ఓ దశలో విరామం లేని క్రికెట్ కారణంగా మ్యాక్స్ వెల్ మానసిక సమస్యలతో సతమతమయ్యాడు. మ్యాక్స్ వెల్ బాధపడుతోంది మానసిక సమస్యలతోనే అని మొదట గుర్తించింది వినీయేనట! ఆమె సహచర్యంలోనే ఈ విధ్వంసక క్రికెటర్ త్వరగా కోలుకుని, పునరుత్తేజంతో మైదానంలో అడుగుపెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది.
Wed, Feb 26, 2020, 08:41 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View