వేములవాడలో పట్టపగలు నడిరోడ్డుపై రౌడీ షీటర్ దారుణహత్య
Advertisement
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టపగలు నడిరోడ్డుపై శివ అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఉదయం బైక్‌పై వెళ్తున్న శివను గుర్తించిన మాజీ కౌన్సిలర్ వెంకటేశం తన మనుషులతో కలసి వెంబడించి కత్తులతో పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న శివను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. శివపై కత్తులతో దాడిచేసిన మాజీ కౌన్సిలర్ వెంకటేశం ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, Feb 26, 2020, 08:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View