ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు.. కానీ ఇది పాన్ వరల్డ్ డార్లింగ్స్: నాగ్ అశ్విన్
Advertisement
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు. అయితే, ఇంతకన్నా ఎక్కువ చెప్పడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. "కొంతమంది ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అది తప్పు... ప్రభాస్ పాన్ ఇండియా ఎప్పుడో కొట్టేశారు. ఇది పాన్ వరల్డ్ డార్లింగ్స్!" అంటూ ట్వీట్ చేశారు. తనతో చిత్రాన్ని అంగీకరించినందుకు ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
Wed, Feb 26, 2020, 07:30 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View