సీఎం జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి
26-02-2020 Wed 18:17
- హుద్ హుద్ తుపాను బాధితుల కోసం నిధులు సేకరించామన్న నిర్మాతలు
- ఆ నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడి
- ఇళ్ల ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు భారీగా విరాళాలు సేకరించి, దాదాపు రూ.15 కోట్లతో బాధితులకు ఇళ్లు నిర్మించామని సీఎంకు తెలిపారు. ఇప్పుడు ఆ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. దీనిపై సీఎం స్పందన తెలియరాలేదు. కాగా, అప్పట్లో హుద్ హుద్ తుపాను సంభవించిన సమయంలో విశాఖ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత క్రమంగా అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
More Latest News
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి
7 hours ago

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
8 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
9 hours ago
