నిర్భయ దోషులకు చివరి లేఖ రాసిన తీహార్ జైలు అధికారులు
22-02-2020 Sat 13:02
- కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖ
- కుటుంబ సభ్యులను కలుస్తామని చెప్పిన అక్షయ్, వినయ్
- మార్చి 3న దోషులకు ఉరిశిక్ష అమలు

మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు చివరి లేఖను రాశారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిస్తామంటూ లేఖలో అధికారులు పేర్కొన్నారు. అయితే, దోషుల్లో ఇద్దరైన అక్షయ్, వినయ్ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుస్తామని అధికారులకు చెప్పారట. ముఖేశ్, పవన్ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీకి ముందే తాము కుటుంబ సభ్యులను కలిశామని జైలు అధికారులకు తెలిపారు. మరోవైపు, వినయ్ తన తలను జైల్లోని గోడకు కొట్టుకోవడంతో, జైలు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
28 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
45 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago

20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
2 hours ago
