దసరా బరిలోకి విజయ్ దేవరకొండ మూవీ?
Advertisement
విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే రెండు టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా మారిపోవడంతో, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని సంతరించుకుంది. ఈ సినిమా బడ్జెట్ పరిధి 50 కోట్లకి పైగా పెంచేశారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ స్థాయి బడ్జెట్ ను తిరిగి రాబట్టుకోవడం పెద్ద విషయమేం కాదనే నమ్మకంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. డిఫరెంట్ లుక్ తో విజయ్ దేవరకొండ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. దాంతో దసరా బరిలోకి ఈ సినిమాను దింపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sat, Feb 22, 2020, 11:35 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View