సుకుమార్ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం?
Advertisement
అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. స్మగ్లర్ లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రలో రింగుల జుట్టుతో .. గుబురు గెడ్డంతో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ లుక్ నేచురల్ గా ఉండటం కోసమే ఆయన కొంత సమయం తీసుకుంటున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ మరో పాత్రను కూడా పోషించనున్నాడనేది తాజా సమాచారం. ఆ లుక్ కాస్త స్టైలీష్ గా .. మోడ్రన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే సుకుమార్ 'రంగస్థలం'వంటి హిట్ ఇచ్చి వున్నాడు. ఇక అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'తో సంచలన విజయాన్ని నమోదు చేసి వున్నాడు. మరో వైపున వరుస విజయాలతో రష్మిక దూసుకుపోతోంది. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే వున్నాయి.
Sat, Feb 22, 2020, 11:14 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View