అయోధ్యలో స్మారక చిహ్నం నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్న శివసేన
Advertisement
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, సరికొత్త డిమాండ్ తో శివసేన తెరపైకి వచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సేన డిమాండ్ చేసింది.

అమర జవాన్ల మాదిరిగానే వీరి పేర్లను కూడా స్మారక స్థూపంపై రాయలని కోరింది. సరయూ నది తీరంలో ఈ స్థూపాన్ని నిర్మించాలని సూచించింది. అమరులైన హిందూ సంస్థల కార్యకర్తలు, శివసేన కార్యకర్తలకు ఆ విధంగా సరయూ తీరంలో నివాళులు అర్పించాలని విన్నవించింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మరోవైపు, ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే ట్రస్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. 2024 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Sat, Feb 22, 2020, 10:18 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View