మెగా హీరో జోడీగా బాలీవుడ్ భామ
20-02-2020 Thu 16:04
- బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- ఈ నెల 24వ తేదీన షూటింగు మొదలు

తెలుగు తెరపై బాలీవుడ్ భామల జోరు కొనసాగుతూనే వుంది. పారితోషికం ఎంతైనా లెక్కచేయకుండా కొత్తదనం కోసం .. ప్రేక్షకులు కోరుకునే గ్లామర్ ను అందించడం కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలను రంగంలోకి దింపుతున్నారు. ఈ కోవలోనే తెలుగు తెరకి మరో బాలీవుడ్ భామ పరిచయమవుతోంది.. ఆమె పేరే సయీ మంజ్రేకర్.
ఈ అమ్మాయి ఎవరో కాదు .. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు. సల్మాన్ సరసన 'దబాంగ్ 3'లో సందడి చేసింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాను అల్లు బాబీ - సందీప్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
9 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
9 hours ago
