అసెంబ్లీ కార్యదర్శిపై మండలి చైర్మన్ కక్ష సాధిస్తున్నారు: సీఎస్ కు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు
19-02-2020 Wed 18:48
- మండలి నుంచి వచ్చిన ఫైల్ ను తిప్పిపంపిన అసెంబ్లీ కార్యదర్శి
- మండలి చైర్మన్ షరీఫ్ అసంతృప్తి
- చైర్మన్ బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారన్న సచివాలయ ఉద్యోగుల సంఘం చీఫ్

సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైలును ఏపీ అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపడంపై మండలి చైర్మన్ షరీఫ్ సీరియస్ గా వున్న విషయం విదితమే. ఈ విషయమై ఆయన గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, మండలి చైర్మన్ షరీఫ్ అసెంబ్లీ కార్యదర్శి పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎస్ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న అసెంబ్లీ కార్యదర్శిని బెదిరించడం, మానసికంగా వేధించడం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శికి తాము మద్దతుగా నిలుస్తామని, ఈ విషయంలో గవర్నర్ వరకు వెళతామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
8 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
9 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
10 hours ago
