మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్... కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామ్యం
Advertisement
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ జోడీ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకు ఎక్కువగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఈసారి ఆయనకు నందమూరి కల్యాణ్ రామ్ కూడా జత కలిశారు. ఈ ఏడాది మే నుంచి షూటింగ్ షురూ కానుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఎన్టీఆర్ కు 30వ చిత్రం కానుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.
Wed, Feb 19, 2020, 06:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View