కాంగ్రెస్​ కు ఎందుకు ఓటేయడం లేదో జనాన్ని అడుగుదాం.. సోనియాగాంధీకి బీహార్​ నేత​ లేఖ
Advertisement
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో దారుణ పరాజయం నేపథ్యంలో బిహార్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇంతిఖబ్ ఆలం బుధవారం సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. జనం మనకు ఎందుకు ఓటేయడం లేదో అడుగుదామని, ఇందుకోసం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని చేపడదామని కోరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయిలో..

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు వెళ్లిపోతున్నాయని ఆలం తన లేఖలో పేర్కొన్నారు. అసలు ఓటర్లు కాంగ్రెస్ పట్ల ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? ఎందుకు పార్టీకి ఓటేయడం లేదన్నది అడిగి తెలుసుకుందామని సూచించారు. ‘పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయికి (పంచాయత్ టు స్టేట్ లెవల్)’ పేరిట కార్యక్రమాన్ని చేపడదామని కోరారు.
Wed, Feb 19, 2020, 05:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View