సీఏఏ, ఎన్నార్సీ విషయంలో ఆందోళన చెందొద్దు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
Advertisement
పార్లమెంటులో సీఏఏకి వైసీపీ మద్దతు తెలిపిన సమయంలో ఎన్పీఆర్, ఎన్నార్సీలు లేవని... ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు తమ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అక్రమ వలసలు, చొరబాట్లు, దేశ భద్రత అంశాల కారణంగానే సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నార్సీ అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు.

ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వారికి వైసీపీ అండగా ఉంటుందని సజ్జల భరోసా ఇచ్చారు. సీఏఏ, ఎన్నార్సీల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పారు.
Wed, Feb 19, 2020, 04:57 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View