సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు 600 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన అభిమాని
14-02-2020 Fri 14:22
- ఐదు రోజుల్లోనే అంతదూరం తొక్కిన 52 ఏళ్ల భుపేన్ లిక్సన్
- అస్సాంలోని గువహటిలో 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం
- ఆ ప్రోగ్రామ్ కు వస్తున్న సల్మాన్ ను కలిసేందుకు అభిమాని ప్రయత్నం

తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు 52 ఏళ్ల వయసున్న భూపేన్ లిక్సన్ 600 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాడు. అసోంలోని జగున్ గ్రామం నుంచి ఫిబ్రవరి 8న సైకిల్ తొక్కడం మొదలుపెట్టి 13వ తేదీన ఆ రాష్ట్రంలోని పెద్ద పట్టణం గువహటికి చేరుకున్నాడు. తాను సైకిల్ తొక్కుతున్న, సల్మాన్ సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ప్రింట్ చేసిన ఓ పోస్టర్ ను సైకిల్ కు పెట్టుకుని తన అభిమానాన్ని చాటాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సల్మాన్ ఫిలింఫేర్ ప్రోగ్రామ్ కు వస్తుండటంతో..
అసోంలోని గువహటిలో ఈ నెల 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఖాన్ ఆ ప్రోగ్రాంలో పాల్గొననున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భూపేన్.. తమ గ్రామం నుంచి సైకిల్ పై గువహటికి బయలుదేరాడు. ఐదు రోజుల్లోనే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి.. 13న సాయంత్రం నగరానికి చేరుకున్నాడు.భూపేన్ సైక్లింగ్ చాంపియనే..
భూపేన్ యుక్త వయసులో ఉన్నప్పుడు అసోంలో సైక్లింగ్ చాంపియన్. తన పేరిట కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. అయితే 52 ఏళ్ల వయసులో ఏకంగా 600 కిలోమీటర్లుపైగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ఆసక్తిగా మారింది.More Latest News
‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
10 minutes ago

3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును!... ట్విట్టర్ హ్యాండిల్లో కొత్త వాక్యాన్ని చేర్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
30 minutes ago

పోలీసులకు దొరకకూడదని టెడ్డీబేర్ లో దాక్కున్న దొంగ!
31 minutes ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
42 minutes ago
