డేవిడ్ వార్నర్‌కు ప్రతిష్ఠాత్మక అలెన్ బోర్డర్ మెడల్!

11-02-2020 Tue 09:46
advertisement

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు క్రికెట్ నుంచి నిషేధానికి గురైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రతిష్ఠాత్మక అలెన్ బోర్డర్ మెడల్‌ను అందుకున్నాడు. అతడితోపాటు నిషేధం ఎదుర్కొన్న ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్ ఈ రేసులో నిలిచినా చివరికి వార్నర్‌కే ఈ పతకం లభించింది. 2016, 2017లో వరుసగా రెండేళ్లు ఈ పతకాన్ని అందుకున్న వార్నర్.. తాజాగా ఒక్క ఓటు తేడాతో మరోమారు దీనిని సాధించాడు.

నిషేధం తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోతున్న వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పతకాన్ని అందజేసింది. మెడల్ అందుకున్న అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. చేసిన తప్పుకు గతంలో అందరి ముందు తల వంచుకున్నానని, ఈ సీజన్ తనలో మళ్లీ సంతోషాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement