'ఉప్పెన' నుంచి విజయ్ సేతుపతి ఫస్టు లుక్
10-02-2020 Mon 17:42
- బుచ్చిబాబు నుంచి వస్తున్న 'ఉప్పెన'
- 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి
- ఏప్రిల్ 2వ తేదీన విడుదల

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కృతి శెట్టి పరిచయమవుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. 'రాయనం' పాత్రలో ఆయన కనిపించనున్నాడు.
'రాయనం' పాత్రని పరిచయం చేస్తూ విజయ్ సేతుపతి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సముద్ర తీరంలో బ్లాక్ అంబాసిడర్ కారు పక్కనే మాస్ లుక్ తో విజయ్ సేతుపతి చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు జాలరి గూడానికి చెందినవాడిగా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
More Latest News
టీఆర్ ఎస్ లో ఉద్యమకారులకు విలువ లేదు.. కాంగ్రెస్ పై విశ్వాసం పోయింది.. బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
24 minutes ago

ల్యాప్ టాప్ లు ఇవ్వకపోతే ప్రశ్నించాలి కానీ...!: సజ్జల
26 minutes ago

ద్రౌపది ముర్ముతో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ భేటీ
30 minutes ago

'దసరా' సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
40 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
58 minutes ago
