సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

01-02-2020 Sat 07:27
advertisement

*  వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ ప్రస్తుతం అనంతపురం పరిసరాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కథానాయికగా ప్రియమణి నటిస్తుండగా, తాజాగా అమలాపాల్ ను కూడా తీసుకున్నారు. త్వరలోనే ఆమె ఈ షూటింగులో జాయిన్ అవుతుందట.
*  అనుష్క కథానాయికగా తెలుగులో వచ్చిన 'భాగమతి' చిత్రాన్ని దర్శకుడు అశోక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ నాయిక భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.
*  యంగ్ హీరో నితిన్ వివాహం తన ప్రేమికురాలు శాలినితో ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ క్రమంలో వీరి వివాహ నిశ్చితార్థాన్ని ఈ నెల 15న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచ్చేస్తారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement